Sri Jayendravani    Chapters    Last Page

ఓం శ్రీ గురుభ్యో నమః

(గురుదేవునకు వందనములు)

మనలో ప్రతివారికిని తల్లిదండ్రి వున్నట్లుగనే మనందరకు గురువొకడు ఉంటాడు.

''తన మనస్సనే మానససరోవరంలో ఉద్భవించిన కమలముల పుప్పొడి నుండి పూదేనెను (అమృతాన్ని) గ్రోలటానికి వచ్చే తేనెటీగల వలె పలుదిశల నుండి ఆసక్తితో నమ్రత తొణికిసలాడ వ్యాఖ్యా నామృతాన్ని త్రాగుటకు వచ్చు శిష్యగణం కల్గిన భాష్యకారునకు నా అవనతనమోవాకములు.''

కంచిలో నివసించే పరమాచార్యులే మనకు గురువు. వారు తమ 13వ ఏట కంచి కామకోటి మఠానికి అధిపతి ఐనారు. ఇప్పుడు వారు తమ 79వ సంవత్సరం పూర్తిచేసికొని 80వ ఏట ప్రవేశించారు. మహాపురుషుల వయోనిర్ణయాన్ని గురించి మనం మన లౌకికదృష్టితో మాత్రమే ప్రస్తావిస్తాము. కాని యధార్థంగా వారు దైవాంశ సంభూతులు.

గురువును మనం ఈ క్రింది విధంగా ప్రార్థిస్తాం.

గురుర్‌ బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్‌దేవో మహేశ్వరః |

గురుః సాక్షాత్‌ పరం బ్రహ్మ తసై#్మ శ్రీగురవే నమః ||

xmsLRiª«sW»R½ø xqs*LRiWxmso²R…V gRiVLRiVª«so. xmsLRiª«sW¿yLRiVùÌÁV »R½ª«sV NRPLRiVßძsV, AbdPxqsV=ÌÁƒ«sV ª«sVƒ«s\|ms NRPVLjizmsLi¿RÁVÈÁNRPV ª«sVƒ«sÍÜ[ ª«sV¬sztsQgS @ª«s»R½LjiLi¿yLRiV. @LiµR…VZNP[ úFy»R½MNSÌÁª«sVVƒ«s ÛÍÁ[ÀÁ A¸R…Vƒ«sƒ«sV ˳ÏÁNTPò úaRPµôðR…ÌÁ»][ úFyLójiLixmsª«sÛÍÁƒ«sV. ÍÝNTPNRPµR…XztísQ»][ xmsLjibdPÖÁLiÀÁ ªyLRiV ª«sVƒ«s ª«sVµ³R…ù B¬sõ xqsLiª«s»R½=LSÌÁV ª«sWú»R½®ªs[V ÒÁ„sLiÀÁ ¸R…VVƒyõLRi¬s ˳؄sLiÀÁ ƒ«sxmsöÉÓÁNUP, ªyLRiV \®µ…ªyLiaRPxqsLi˳ÏÁW»R½VÌÁV gRiƒ«sVNRP FsÌýÁxmsöV²R…Vƒ«sV ª«sVƒ«s»][®ƒs[ ÒÁ„sLiÀÁ ¸R…VVƒyõLRi¬s gRiVLRiVòLi¿RÁVN][ ª«sÌÁ¸R…VVƒ«sV. NRPƒ«sVNRP ª«sVƒ«s gRiVLRiVª«soÌÁ ¹¸…VVNRPä A¸R…VVLSL][gRiùª«sVVÌÁ N]LRiNRPV úFyLóRiƒ«s xqsÌÁVxmsª«sÛÍÁƒ«sV.

ఒక జీవి 81 సంవత్సరాలు జీవితం పూర్తిచేస్తే వేయి చంద్రుల దర్శనం పూర్తి చేసినట్లు. అతడు 'సహస్ర చంద్రదర్శనం' పూర్తి చేసినట్లు అంటూ ఉంటాం.

మనం మన అభీష్టాలన్నీ నెరవేర్చుకోగలందులకు మన కంచి పరమాచార్యులు మంచి ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించి ఉండాలని భగవంతుని ప్రార్థిద్దాం. ఆచార్యునిపై దృఢ విశ్వాస ముంచి మనం సుఖంగా గడుపుదాం.

మన దైనందిన జీవితాన్ని సుఖప్రదం చేసికోటానికి, మన మనస్సుల్ని నిర్మలంగా ఉంచుకోవటానికి, భగవత్పాదుల చరణ కమలాల్ని మరువకుండా వుండాలి. మనం ఎంత శ్రద్ధతో వారిని తలచుకుంటే వారు అంత శ్రేయస్సును మనకు ప్రసాదిస్తారు. మనం ధనికులమైన, బీదలమైన వారి చరణ సన్నిధిని విడనాడరాదు. మన సన్నిహిత ప్రజలను కూడ గురువును ఆశ్రయించి గురు కటాక్షాన్ని, ఆశీస్సులను పొందుటకు ప్రోత్సహించాలి.

కాన మనమందరమేకాక ప్రపంచ ప్రజలెల్లరును సుఖంగా జీవించుటకై పరమాచార్యులు ఆయురారోగ్యములతో వర్థిల్లాలని మనం ప్రార్థిద్దాం.

Sri Jayendravani    Chapters    Last Page